2022 డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకు ఏడాది పాటు G20 దేశాల అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది. G20, లేదా గ్రూప్ ఆఫ్ ట్వంటీ, ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్ ప్రభుత్వ వేదిక. ఇందులో 19 దేశాలు (అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, అమెరికా), యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల వాటాను జీ20 కలిగి ఉంది.
మరింత తెలుసుకోండి